BREAKING
thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత
మంచి మాట
Date of Publish : 31 October 2026, 08:35 pm
Posted by : KOLA MAHESH

ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
31 Oct, 2026 - 08:35 PM
5 వీక్షణలు
  • దేశ ఐక్యత, సమగ్రత కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకురాలు: కాంగ్రెస్‌ నేతలు
  • గార్లలో మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలు.. ఘనంగా నివాళులు

మహబూబాబాద్‌ జిల్లా, గార్ల, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌):

భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని గార్ల మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొనియాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం గార్ల మండల కేంద్రంలోని ఇందిరానగర్‌లో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణగౌడ్‌ ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతీయ శ్రీశక్తి అవార్డు గ్రహీత, జిల్లా కాంగ్రెస్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలు శంషాద్‌ బేగం, గార్ల మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ భానోత్‌ పార్వతి హతిరాం నాయక్‌ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 'గరీబీ హటావో' నినాదంతో పేద ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. దేశంలో పలు ఆర్థిక, సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి భారతదేశ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకురాలిగా ఇందిరాగాంధీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పళ్ళ నరసయ్య, మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బానోత్‌ హతిరాంనాయక్‌, గోపాలపురం ఉపసర్పంచ్‌ ఎర్రగడ్డ శ్రీనివాస్‌, గార్ల మేజర్‌ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తోడేటి శ్రీనివాస్‌, పఠాన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌, రవి నాయక్‌, భూక్య సర్వేశ్‌ నాయక్‌, నరేష్‌ తదితరులు పాల్గొని ఇందిరాగాంధీకి నివాళులర్పించారు.