BREAKING
thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత
మంచి మాట
Date of Publish : 31 October 2026, 08:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Oct, 2026 - 08:59 PM
14 వీక్షణలు

ఓటరు గుర్తింపు కోసం 12 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ 

నవంబర్ 1న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటరు జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి నిర్ణీత సమయంలో చేరుకుని ఓటు వేయాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఓటరు గుర్తింపునకు 12 రకాల కార్డులు ఓటరు జాబితాలో పేరున్న వారు ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపు కోసం అనుమతించిన కార్డులు:

  1. ఆధార్ కార్డు
  2. డ్రైవింగ్ లైసెన్స్
  3. పాన్ కార్డు
  4. పాస్‌పోర్ట్
  5. పోస్టాఫీసు పాస్‌బుక్
  6. ఉపాధి హామీ పథకం వేతన జాబ్ కార్డు
  7. ఆరోగ్య బీమా కార్డు
  8. పెన్షన్‌కు సంబంధించిన పత్రం
  9. ఉద్యోగుల అధికారిక గుర్తింపు కార్డు
  10. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) గుర్తింపు పత్రం
  11. ఎన్నికల సంఘం అనుమతించిన స్మార్ట్ కార్డు
  12. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో నిర్ధారించుకోవాలని, గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.