BREAKING
thumb ● మున్సిపల్‌ ఎన్నికల వేళ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. రేపు ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి thumb ● జర్నలిస్ట్‌ రామన్న నాయక్‌పై హత్యాయత్నం.. thumb ● నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు thumb ● బాలాజీ పాఠశాలలో ఘనంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● శివనాదపాలెంలో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● మున్సిపల్‌ ఎన్నికల వేళ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. రేపు ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి thumb ● జర్నలిస్ట్‌ రామన్న నాయక్‌పై హత్యాయత్నం.. thumb ● నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు thumb ● బాలాజీ పాఠశాలలో ఘనంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● శివనాదపాలెంలో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం
మంచి మాట
Date of Publish : 31 October 2026, 11:11 pm
Posted by : KOLA MAHESH

మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
31 Oct, 2026 - 11:11 PM
9 వీక్షణలు
  • ఐదు రోజుల ఉద్యమ కార్యాచరణ ప్రారంభం.. పెండింగ్‌ డిమాండ్ల పరిష్కారానికి విజ్ఞప్తి
  • నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన

మహబూబాబాద్‌ జిల్లా, నర్సింహులపేట, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌):

మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మోడల్‌ స్కూల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (MS-JAC) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం నర్సింహులపేట తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఐదు రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా తొలిరోజు చేపట్టిన ఈ నిరసనలో పాఠశాల ఉపాధ్యాయులందరూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా నెలవారీ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో మరణించిన ఉపాధ్యాయుల అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించాలని కోరారు.

అలాగే సర్వీస్‌ నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, అర్హులైన టీజీటీ ఉపాధ్యాయులకు నోషనల్‌ ప్రయోజనాలు మంజూరు చేయాలని, హెచ్‌బీటీ ఉపాధ్యాయుల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, ఉపాధ్యాయుల న్యాయమైన హక్కులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఐదు రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా తదుపరి రోజుల్లోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు తెలిపారు.