బాలాజీ పాఠశాలలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పటేల్ సేవలపై అవగాహన
వరంగల్ జిల్లా, నర్సంపేట, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
నర్సంపేటలోని బాలాజీ విద్యాసంస్థలకు చెందిన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ ఏ. వనజ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ తొలి ఉప ప్రధానిగా, ఉక్కుమనిషిగా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన చేసిన సేవలు, స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను ఏకం చేయడంలో పోషించిన కీలక పాత్రను తెలియజేశారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.