BREAKING
thumb ● మున్సిపల్‌ ఎన్నికల వేళ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. రేపు ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి thumb ● జర్నలిస్ట్‌ రామన్న నాయక్‌పై హత్యాయత్నం.. thumb ● నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు thumb ● బాలాజీ పాఠశాలలో ఘనంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● శివనాదపాలెంలో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● మున్సిపల్‌ ఎన్నికల వేళ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. రేపు ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి thumb ● జర్నలిస్ట్‌ రామన్న నాయక్‌పై హత్యాయత్నం.. thumb ● నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు thumb ● బాలాజీ పాఠశాలలో ఘనంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● శివనాదపాలెంలో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం
మంచి మాట
Date of Publish : 31 October 2026, 11:15 pm
Posted by : KOLA MAHESH

నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
Kola Mahesh Munugodu Constituency
31 Oct, 2026 - 11:15 PM
10 వీక్షణలు
  • బాలల హక్కులు, చట్టాలు, భద్రతపై విద్యార్థులకు వివరించిన న్యాయ నిపుణులు
  • డెమోక్రటిక్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

వరంగల్‌ జిల్లా, నర్సంపేట, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌):

విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో డెమోక్రటిక్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని డాఫోడిల్స్‌ హైస్కూల్‌ ఆడిటోరియంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సంస్థ జాతీయ చైర్మన్‌ అయిలినేని శ్రీనివాసరావు సూచన మేరకు వరంగల్‌ జిల్లా చైర్మన్‌ డ్యాగల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సదస్సులో మండల న్యాయ సేవాధికార సంస్థ కమిటీ సభ్యులు, లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ అడ్వకేట్‌ డి. సాంబయ్య, లోక్‌ అదాలత్‌ సభ్యురాలు, అడ్వకేట్‌ టి. సునీత, ప్యానెల్‌ అడ్వకేట్‌ ఎన్‌. రమేష్‌, అడ్వకేట్‌ ఎ. సుధీర్‌ పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా న్యాయ నిపుణులు మాట్లాడుతూ బాలలపై జరిగే వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలికలపై వేధింపుల నివారణకు సంబంధించిన అంశాలను వివరించారు. బాలల రక్షణకు ఉన్న చట్టాలు, హక్కులు, బాధ్యతలు, వ్యక్తిగత భద్రతపై విద్యార్థులకు సూచనలు అందించారు.

విద్యార్థులు ఎవరైనా వేధింపులు లేదా ఇతర సమస్యలు ఎదుర్కొన్నప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. న్యాయ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా డెమోక్రటిక్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ వరంగల్‌ జిల్లా చైర్మన్‌ డ్యాగల శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యతో పాటు సామాజిక బాధ్యత, చట్టాలపై అవగాహన అవసరమని అన్నారు. నేటి బాలలే రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి సమాజ అభివృద్ధికి తోడ్పడతారని పేర్కొన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డెమోక్రటిక్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ వరంగల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు భేతి భాస్కర్‌, జనరల్‌ సెక్రటరీ చెన్నూరి రవి, చెన్నారావుపేట మండల చైర్మన్‌ బర్ల యాకయ్య, నర్సంపేట పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్‌, పట్టణ యూత్‌ చైర్మన్‌ గోపగాని నాగరాజు, కమిటీ సభ్యుడు వడిచర్ల రమేష్‌, డాఫోడిల్స్‌ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ చింతల నరేందర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.