BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 12 October 2026, 03:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో చాట్రాయి జనసేన నాయకులకు అవకాశం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Oct, 2026 - 03:29 PM
29 వీక్షణలు

నూజివీడు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో చాట్రాయి జనసేన నాయకులకు చోటు

చిత్తపూరుకు చెందిన వలసపల్లి రామకృష్ణ, బత్తుల శివకు నిర్వాహక్ దళ్ సభ్యులుగా బాధ్యతలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు వలసపల్లి రామకృష్ణ, బత్తుల శివకు నిర్వాహక్ దళ్ సభ్యులుగా అవకాశం లభించింది. ఈ నియామకంతో చిత్తపూరు గ్రామం, చాట్రాయి మండల జనసేన నాయకులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమైంది.

ఈ సందర్భంగా వలసపల్లి రామకృష్ణ మాట్లాడుతూ, తమపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు, పార్టీ రాష్ట్ర, నియోజకవర్గ స్థాయి నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తామని పేర్కొన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయడంతో పాటు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

వలసపల్లి రామకృష్ణ, బత్తుల శివలకు సమన్వయ కమిటీలో అవకాశం లభించడంపై చిత్తపూరు గ్రామం, చాట్రాయి మండలానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. వారి నియామకం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.