BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
Date of Publish : 09 October 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో చేగువేరా 59వ వర్ధంతి వేడుకలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Oct, 2026 - 01:17 PM
10 వీక్షణలు

పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన విప్లవ యోధుడు చేగువేరా

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో అఖిల భారత యువజన సమాఖ్య (AIYF), అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) మధిర మండల సమితుల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ విప్లవ యోధుడు చేగువేరా 59వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ, చేగువేరా దోపిడీకి వ్యతిరేకంగా, పీడిత ప్రజల విముక్తి కోసం తన వైద్య వృత్తిని, సుఖవంతమైన జీవితాన్ని సైతం వదులుకొని పోరాట బాట పట్టిన గొప్ప విప్లవ యోధుడని కొనియాడారు. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా, అణగారిన ప్రజల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు.

1967 అక్టోబర్ 9న బొలీవియాలో హత్యకు గురైన చేగువేరా, తన విప్లవ భావజాలంతో ప్రపంచ యువతపై చెరగని ముద్ర వేశారని వక్తలు తెలిపారు. అన్యాయాన్ని ప్రశ్నించడం, దోపిడీకి వ్యతిరేకంగా నిలబడటం, సమాజంలో సమానత్వం కోసం పోరాడటం వంటి విలువలను ఆయన జీవితం చాటిచెబుతోందని అన్నారు. ప్రజల హక్కుల సాధన కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో AIYF మధిర మండల కార్యదర్శి సంపసాల సాయి, AISF మధిర మండల ఉపాధ్యక్షుడు కొండూరు వెంకటకృష్ణ, మండల నాయకులు అశోక్, జస్వంత్, చంద్రహాస్, వివేక్, వెంకీ, మణికంఠ, పవన్ కళ్యాణ్, ఉపేంద్ర, గోపి, మోహన్ క్రాంతి, మాధవ్, నరేంద్ర, రవి, మురళి, మనోజ్, తనీష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.