BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

వరద బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు

తెలంగాణ
30 Oct, 2025 - 08:37 AM
107 వీక్షణలు
వరద బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు NTODAY NEWS:- తెలంగాణ రాష్ట్రం మొంథా తుపాను వల్ల తీవ్ర ప్రభావానికి గురైన వరంగల్‌, హనుమకొండ తదితర ప్రాంతాల్లో వరద బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావత ప్రాంతాలకు వెంటనే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని, రాష్ట్ర డీజీపీ గారిని ఆదేశించారు. వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి,  మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. అత్యవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం, హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామగ్రిని వినియోగించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఎక్కడైనా ఇండ్ల కప్పులు, బంగ్లాల్లో చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా అవసరమైన ఆహారం, మంచినీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తతతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు తలపెట్టిన వరంగల్ జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్న ముఖ్యమంత్రి గారు గురువారం రోజున వరంగల్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. #CMRevanthReddy #CycloneMontha #Warangal #Hanamkonda #ReliefOperation #SDRF Follow us on Website Facebook Instagram YouTube