BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 03:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల 36వ వార్డులో కూటమి నేతల జోరుగా ఇంటింటి ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ బాపట్ల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 03:01 PM
30 వీక్షణలు

 అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రంగంలోకి దిగిన మంత్రి పార్థసారథి, ఎంపీ, ఎమ్మెల్యే

బాపట్ల జిల్లా: బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పట్టణంలోని 36వ వార్డులో కూటమి నాయకులు హోరాహోరీగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను నేరుగా కలుస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆయనతో పాటు బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ రాజు, కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్, 36వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అంకాల సునీత ప్రచారంలో పాల్గొన్నారు. వార్డులోని వీధులు, కాలనీల్లో పర్యటిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు కూటమి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం అందించాలంటే మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్‌తో పాటు 36వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అంకాల సునీతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముఖ్య నేతలంతా ఒకేసారి ప్రచార బరిలోకి దిగడంతో 36వ వార్డులో రాజకీయ సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.