BREAKING
thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ
Date of Publish : 07 October 2026, 09:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలకు సమగ్ర సన్నాహాలు పూర్తి చేయాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 09:40 PM
12 వీక్షణలు

నోటిఫికేషన్‌కు ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలి: డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా

గుంటూరు, అక్టోబర్ 7: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు ముందుగానే సమగ్ర సన్నాహాలు పూర్తి చేయాలని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపే అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటే పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విధులను సమర్థవంతంగా నిర్వహించవచ్చని సూచించారు.

మంగళవారం గుంటూరు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలపై ప్రాంతీయ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐజీపీ లా అండ్ ఆర్డర్ మధుసూదన్‌రెడ్డి, ఐజీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు రేంజ్ డీఐజీ ఫకీరప్ప, డీఐజీ లా అండ్ ఆర్డర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని 18 మండలాలు, 257 గ్రామపంచాయతీలు, 16 జడ్పీటీసీలు, 248 ఎంపీటీసీల పరిధిలో చేపట్టాల్సిన ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే పల్నాడు జిల్లాలో 28 మండలాలు, 525 గ్రామపంచాయతీలు, 28 జడ్పీటీసీలు, 434 ఎంపీటీసీలు, బాపట్ల జిల్లాలో 20 మండలాలు, 346 గ్రామపంచాయతీలు, 20 జడ్పీటీసీలు, 297 ఎంపీటీసీలతో పాటు మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను అధికారులు డీజీపీకి వివరించారు.

ప్రకాశం జిల్లాలో 516 గ్రామపంచాయతీలు, 27 జడ్పీటీసీలు, 377 ఎంపీటీసీలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో, మార్కాపురం జిల్లాలో 46 గ్రామపంచాయతీలు, 21 జడ్పీటీసీలు, 275 ఎంపీటీసీల పరిధిలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై కూడా చర్చించారు. నెల్లూరు జిల్లాలోని 976 గ్రామపంచాయతీలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన పోలీసు బందోబస్తు, ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించాలని డీజీపీ సూచించారు. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు బ్యాలెట్ బాక్సుల రక్షణ, తరలింపు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సామగ్రి తరలింపు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ భద్రతా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం, వదంతులు, రెచ్చగొట్టే ప్రచారం వ్యాప్తి చెందకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రాజ్యాంగం, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియ మొత్తం కొనసాగాలని డీజీపీ స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి భయాందోళనలు లేకుండా భద్రతా వాతావరణాన్ని కల్పించడంతో పాటు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, ఎన్నికల సన్నాహకాలపై డీజీపీకి వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.