BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 09:34 pm
Posted by : కూనురు మధు

పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ
/ నల్గొండ
08 Oct, 2026 - 09:34 PM
6 వీక్షణలు


NYODAY NEWS :  నల్లగొండ, 


 పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పట్టభద్రులు, ఉద్యోగులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కంచర్ల భూపాల్‌రెడ్డి చేస్తున్న పోరాటంతో అధికారుల్లో గుబులు పుడుతోందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నల్లగొండలో అవినీతి వ్యవహారాలపై కంచర్ల భూపాల్‌రెడ్డి తీవ్రంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక మంత్రి ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎండలోనూ అధికార పార్టీకి కంచర్ల భూపాల్‌రెడ్డి చలి వణుకు పుట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో డబ్బు, అధికారాన్ని ఉపయోగించి ప్రలోభాలకు గురిచేసే కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గత పట్టభద్రుల ఎన్నికల్లో చివరి 14 రోజుల్లో అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఏనుగుల రాకేష్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నారని అన్నారు. నల్లగొండలో రాకేష్‌రెడ్డికి భారీ మెజార్టీ వచ్చేలా పట్టభద్రులు, ఉద్యోగులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలకాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆకాంక్షించారు.