BREAKING
thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Test 4
Date of Publish : 26 November 2026, 03:47 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

బాలానగర్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

తెలంగాణ
26 Nov, 2026 - 03:47 PM
23 వీక్షణలు

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు

ఎన్ టుడే న్యూస్ – బాలానగర్: బాలానగర్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పిస్తూ నవంబర్ 26న ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ వేడుకలకు భారత్ ముక్తి మోర్చా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసురామ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో బాలానగర్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు, మాజీ అధ్యక్షులు, సంఘం సభ్యులు, మాజీ సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి మహోన్నత ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను భావితరాలకు తెలియజేయడంతో పాటు వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జై భీమ్! జై భారత్!