BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 12 October 2026, 07:53 am
Posted by : SEETHA KIRAN KUMAR

జిల్లాల్లోనూ ఇందిరమ్మ టవర్ల నిర్మాణం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
12 Oct, 2026 - 07:53 AM
75 వీక్షణలు

తొలి దశలో వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో అమలు

తెలంగాణ: హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (HMDA) పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్రంలోని జిల్లాల్లోనూ వీటిని నిర్మించాలని నిర్ణయించింది. అన్ని ఉమ్మడి జిల్లాల్లో దశలవారీగా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని యోచిస్తోంది. తొలి దశలో వరంగల్ (WGL), నిజామాబాద్ (NZB) జిల్లాల్లో నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమాచారం.

ఒక్కో ఫ్లాట్‌కు రూ.5 లక్షల సబ్సిడీ

HMDA పరిధిలో 560 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి సుమారు రూ.11 లక్షలు ఖర్చవుతుండగా, జిల్లాల్లో ఈ వ్యయం రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ పథకం కింద ఒక్కో ఫ్లాట్‌కు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుండగా, మిగిలిన మొత్తంలో లబ్ధిదారులు రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. జిల్లాల్లో నిర్మాణాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, ఇతర మార్గదర్శకాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.