BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 10 October 2026, 10:19 am
Posted by : కూనురు మధు

నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
10 Oct, 2026 - 10:19 AM
29 వీక్షణలు

పెద్దకాపర్తిలో రైతులకు సూచించిన జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ మేనేజర్  పీడీ సుదర్శని

రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రత్యేక పంటలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందాలని నల్లగొండ జిల్లా  జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ  ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శని సూచించారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో శుక్రవారం  రైతులకు వ్యవసాయ సాగు పద్ధతులు, పంటల యాజమాన్యంపై ఆమె పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సుదర్శని మాట్లాడుతూ రైతులు వరి, పత్తి పంటలతో పాటు భూసారం, వాతావరణ పరిస్థితులు, నీటి వసతులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ ప్రత్యేక పంటల సాగు, వాటి యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వరి పంటలో చీడపీడలు, పత్తి పంటలో తెగుళ్ల నివారణకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. పంటలకు తెగుళ్లు సోకినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలతో సరైన నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడంతో పాటు, ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులోనే వినియోగించాలని సూచించారు. మెరుగైన పంటల యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకొని, ఆశించిన దిగుబడులు సాధించవచ్చని సుదర్శని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అందించే సలహాలు, సూచనలను సద్వినియోగం చేసుకొని లాభదాయకమైన వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీటీఎం  తోటకూరి రమేష్‌తో పాటు రైతులు గుత్తా రవీందర్, ఈరటి లవకుమార్, చలమల్ల వెంకట్ రెడ్డి, గుత్తా రాఘవులు, ఎదుళ్ల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.