BREAKING
thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత thumb ● జినుకల రాములమ్మకు యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నివాళులు thumb ● రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలి thumb ● సింగారంలో భూ రీ సర్వే పనులపై ఆర్డీఓ పరిశీలన thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత thumb ● జినుకల రాములమ్మకు యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నివాళులు thumb ● రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలి thumb ● సింగారంలో భూ రీ సర్వే పనులపై ఆర్డీఓ పరిశీలన thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు
Test 4
Date of Publish : 11 October 2026, 01:07 pm
Posted by : PABBINEEDI B SANKAR

రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు

తెలంగాణ
/ తెలంగాణ / సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
11 Oct, 2026 - 01:07 PM
255 వీక్షణలు

రామచంద్రపురం: రామచంద్రపురం డివిజన్‌లోని మందుముల శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బతుకమ్మ, దసరా, జమ్మి పూజ, రావణ దహన కార్యక్రమాల నిర్వహణ తేదీలు ఖరారు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్, గ్రామ పురోహితుడు బాలకృష్ణ పంతులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశానికి రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకుల సమక్షంలో పండుగల నిర్వహణపై చర్చించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని, ఏకాభిప్రాయంతో వేడుకల తేదీలు, సమయాలను ఖరారు చేశారు.

నిర్ణయం ప్రకారం అక్టోబర్ 17న సాయంత్రం 5:30 గంటలకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 20న సాయంత్రం 5:35 గంటలకు దసరా వేడుకలతో పాటు జమ్మి పూజ, రావణ దహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

పండుగలను గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని సమావేశంలో పాల్గొన్న పెద్దలు అభిప్రాయపడ్డారు. వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, వివిధ సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.