మన ఏసీ కన్వెన్షన్ హాల్‌ను ప్రారంభించిన దావ వసంత సురేష్
తెలంగాణ
/
జగిత్యాల
జగిత్యాల: జగిత్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన ఏసీ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ముఖ్య అతిథిగా హాజరై కన్వెన్షన్ హాల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ.. జగిత్యాల పట్టణ ప్రజలకు ఆధునిక సదుపాయాలతో కూడిన కన్వెన్షన్ హాల్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. పట్టణంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు, వేడుకలు నిర్వహించుకునేందుకు ఈ హాల్ సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం కన్వెన్షన్ హాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కన్వెన్షన్ హాల్ యాజమాన్యం, స్థానిక నాయకులు, ప్రముఖులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.