తిరువూరు ఏడీఎం కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ మల్లవరపు శాంతవాణి మృతి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా – తిరువూరు
తిరువూరు ఏడీఎం కోర్టులో సీనియర్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లవరపు శాంతవాణి ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆమె అంతిమయాత్ర సోమవారం సాయంత్రం 4 గంటలకు తిరువూరు పట్టణంలోని భూమా వారి వీధిలో ఉన్న స్వగృహం నుంచి ప్రారంభమవుతుందని న్యాయవాదుల సంఘం, తిరువూరు ఒక ప్రకటనలో తెలిపింది.
మల్లవరపు శాంతవాణి మృతికి న్యాయవాదుల సంఘం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించింది.