వీరాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల విశ్రాంతి షెడ్ ప్రారంభం
సొంత ఖర్చులతో హామీ నెరవేర్చిన మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్‌లో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన విశ్రాంతి షెడ్‌ను మేయర్ దర్ని మధుకర్, సుజాత దంపతులు స్థానిక కార్పొరేటర్ ఎంబాడి కుమారస్వామితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తన సొంత నిధులతో షెడ్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే వృద్ధులు, మహిళలు, ఇతర భక్తులు ఎండ, వానల నుంచి రక్షణ పొందుతూ విశ్రాంతి తీసుకునేందుకు ఈ షెడ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని మేయర్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షెడ్ నిర్మాణంతో భక్తులకు సౌకర్యం కల్పించినందుకు మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.