చనుబండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను వైద్య సిబ్బంది అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. పిల్లల్లో నులిపురుగుల సమస్యను నివారించేందుకు నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవడం ముఖ్యమని తెలిపారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు మాత్రలు తీసుకోలేకపోయిన మిగిలిన విద్యార్థులకు అక్టోబర్ 5వ తేదీన నులిపురుగుల నివారణ మాత్రలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.