రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం
కేంద్రంలోని యంత్రాలు, వైద్య పరికరాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి
రావులపాలెం: మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రావులపాలెంలోని ఎంజీఆర్ (MGR's) రికవరీ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. డాక్టర్ ఎం. గంగిరెడ్డి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ప్రారంభోత్సవం అనంతరం డయాలసిస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన యంత్రాలు, వైద్య పరికరాలను చిర్ల జగ్గిరెడ్డి పరిశీలించారు. చికిత్స కోసం వచ్చే రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, యంత్రాల పనితీరు గురించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న రోగులకు డయాలసిస్ చికిత్స ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి కేంద్రాల ఏర్పాటుతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
డయాలసిస్ కేంద్రం నిర్వహణలో రోగులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు వైద్య సేవలు, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.