BREAKING
thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు
Test 4
Date of Publish : 27 November 2026, 05:03 am
Posted by : K MAHESH

కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
27 Nov, 2026 - 05:03 AM
3 వీక్షణలు

కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముగ్గురు లబ్ధిదారులకు రూ.2.61 లక్షల ఆర్థిక సహాయం

కేసముద్రం: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోంది. కేసముద్రం మండలం కల్వల గ్రామంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సహకారంతో, గంట సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గండి శ్రీనివాస్ చేతుల మీదుగా ముగ్గురు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. మాజీ సర్పంచ్ చింతనూరి వెంకన్నకు రూ.1,71,000, కోడి వీరయ్యకు రూ.60,000, భూక్య సునీతకు రూ.30,000 చొప్పున మొత్తం రూ.2,61,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించి ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు గంట రాంమోహన్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, డొనికెని యుగేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి వెంకన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.