BREAKING
thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు
Test 4
Date of Publish : 27 November 2026, 05:01 am
Posted by : K MAHESH

ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
27 Nov, 2026 - 05:01 AM
6 వీక్షణలు

రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్

వలిగొండ: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్య, వామపక్ష, లౌకికవాద శక్తులు, మేధావులంతా ఐక్యంగా ముందుకు వచ్చి భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కులాలు, మతాల మధ్య వివక్ష, విభేదాలను సృష్టిస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అట్టడుగు వర్గాలు, పేదలు, ముస్లిం మైనారిటీలపై వివక్ష కొనసాగుతోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని తీసుకురావాలనే ఆలోచనలు చేస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని, రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య, సమానత్వ, లౌకిక విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎల్లంకి మహేష్ కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు పోలేపాక యాదయ్య, పట్టణ కార్యదర్శి సల్వాద్రి రవీందర్, చొప్పరి వెంకటేష్, ఏఐవైఎఫ్ మండల ఉపాధ్యక్షుడు కనకబోయిన నందు, బలికె మొగులయ్య, ఎడవల్లి వేమన్న, లక్ష్మమ్మ, ఈదమ్మ, పొట్టేటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.