BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 10:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జింకలపాలెం అంగన్వాడీలో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 10:03 PM
15 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం జింకలపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం చిన్నారులకు నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

అనంతరం జరిగిన అవగాహన కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జ్యోత్స మాట్లాడుతూ చిన్నారులు చిన్న వయస్సు నుంచే పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. భోజనానికి ముందు, భోజనం చేసిన తర్వాత, ఆటలు ఆడిన అనంతరం, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.

ప్రతిరోజూ స్నానం చేసిన అనంతరం శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలని సూచించారు. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడంతో పాటు వాటి కింద మురికి చేరకుండా చూసుకోవాలని వివరించారు. దంతాలను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు షేక్ మీరాబీ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.