అమ్మ ఆశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో తిరువూరులోని అమ్మ ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గంపలగూడెం మండలం చల్లగుండ్లవారిపాలెం గ్రామానికి చెందిన విప్పల చంద్రశేఖరరెడ్డి ఆర్థిక సహకారంతో 15 రోజులకు సరిపడా బియ్యం, పండ్లు, ఇతర నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని తిరువూరు జూనియర్ సివిల్ జడ్జి ఏ. సింధూర చేతుల మీదుగా నిర్వహించారు.
ఈ సేవా కార్యక్రమంలో తిరువూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి.వి. రావు, తిరువూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్ధనరావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, లయన్స్ క్లబ్ కార్యదర్శి శంకర్రావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
వృద్ధుల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలుస్తూ నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన విప్పల చంద్రశేఖరరెడ్డిని పలువురు అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.