BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:28 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి - డాక్టర్ దద్దాల

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పామూరు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
21 Nov, 2026 - 06:28 PM
32 వీక్షణలు

వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను కలిసిన సర్పంచ్ అభ్యర్థి కోటపాటి వెంకట్రావు

పడమటి కట్టకిందపల్లి పంచాయతీ రాజకీయ పరిస్థితులపై చర్చ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచన

కనిగిరి: కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను శనివారం సాయంత్రం పామూరు మండలం పడమటి కట్టకిందపల్లి (వెస్ట్ కట్టకిందపల్లి) పంచాయతీకి చెందిన పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోటపాటి వెంకట్రావు, పార్టీ సీనియర్ నాయకుడు కాకు తిరుపతయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌తో పంచాయతీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పలు అంశాలను చర్చించారు. స్థానికంగా పార్టీ పరిస్థితి, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు.

పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, స్థానికంగా నాయకుల మధ్య సమన్వయం కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ సమావేశం సందర్భంగా పంచాయతీ రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.