BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 05:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ద్వారకాతిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఏలూరు జడ్పీ ఛైర్‌పర్సన్ సాయి నవ్యశ్రీ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 05:54 PM
24 వీక్షణలు

పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా చిన్న తిరుపతి శ్రీవారి సన్నిధికి చింతమనేని కుటుంబం ప్రజల సుఖసంతోషాలు, ఏలూరు జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు ద్వారకాతిరుమల, నవంబర్ 21: ఏలూరు జిల్లా పరిషత్ నూతన ఛైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన చింతమనేని సాయి నవ్యశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం ఉదయం కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్న తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా స్వామివారి సన్నిధికి చేరుకున్న చింతమనేని కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ తూర్పు గోపురం వద్దకు చేరుకున్న జడ్పీ ఛైర్‌పర్సన్ సాయి నవ్యశ్రీ దంపతులు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు, వంకినేని భాను ప్రకాష్ దంపతులతో పాటు కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం ముగిసిన తరువాత ఆలయ మండపంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వారికి వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా చింతమనేని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఏలూరు జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రజలకు మరిన్ని మెరుగైన అవకాశాలు అందుబాటులోకి రావాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నూతనంగా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రజలకు సేవ చేసే అవకాశం మరింత బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. కాగా, చింతమనేని కుటుంబం స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పలువురు భక్తులు, అయ్యప్ప స్వాములు, స్థానిక నాయకులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.