BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 04 July 2026, 12:49 pm
Posted by : బోధపల్లి వేణు

ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకల్లో

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
04 Jul, 2026 - 12:49 PM
99 వీక్షణలు

పాలకుర్తి రిపోర్టర్ వేణు

ఎర్రబెల్లి దయాకర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అల్పాహార కార్యక్రమం.

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తొర్రూర్ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ పేర్ల జంపన్న మరియు తొర్రూర్ టౌన్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో తొర్రూర్ పట్టణంలోని అన్నారం ఎక్స్ రోడ్ వద్ద ఘనంగా అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వందలాది మంది స్థానిక ప్రజలకు అల్పాహారం అందజేసి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధికి కృషి చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, రైతులు, పేదలు, యువత సంక్షేమం కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలనిమనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.