BREAKING
thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Test 4
Date of Publish : 26 November 2026, 06:58 pm
Posted by : K MAHESH

కొత్తపేట, గంధంపల్లి సెంటర్ల వద్ద ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 06:58 PM
13 వీక్షణలు

జాతీయ రహదారి నిర్మాణంతో స్థానికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి: సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్

బయ్యారం, నవంబర్ 26:

జాతీయ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలు, వ్యాపారస్తులకు రాకపోకల పరంగా ఇబ్బందులు తలెత్తకుండా కొత్తపేట, గంధంపల్లి సెంటర్ల వద్ద ప్రత్యేక ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని కొత్తపేట సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ కోరారు. బయ్యారం మండలం మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి రూట్ మ్యాప్‌లో ఈ రెండు ప్రధాన కూడళ్లకు ఎగ్జిట్ మార్గాలు కేటాయించాలని హైవే అధికారులను విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై జాతీయ రహదారి సంస్థ ఈఈతో మాట్లాడిన సర్పంచ్, కొత్తపేట, గంధంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారస్తుల అవసరాలను వివరించారు. జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాత స్థానికులు తమ ప్రాంతాలకు చేరుకోవడానికి, వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగానే ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

తన విజ్ఞప్తిపై ఈఈ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రావి వీరభద్రరావు, దార రఘుపతి, గ్రామస్తులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.