BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:38 pm
Posted by : SEETHA KIRAN KUMAR

యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్ల తయారీ.. రూ.6.78 కోట్ల నకిలీ కరెన్సీ పట్టివేత

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
04 Nov, 2026 - 02:38 PM
6 వీక్షణలు

కుంట్లూరు కేంద్రంగా తయారీ, పంపిణీకి కుట్ర.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఫ్యూచర్ సిటీ పోలీసులు

హైదరాబాద్: యూట్యూబ్, సోషల్ మీడియా వీడియోలు చూసి నకిలీ నోట్ల తయారీ నేర్చుకున్న ఓ వ్యక్తి, తన సహచరులతో కలిసి భారీ స్థాయిలో నకిలీ కరెన్సీ తయారీ, పంపిణీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కుంట్లూరు కేంద్రంగా నకిలీ నోట్ల తయారీ

కుంట్లూరును కేంద్రంగా చేసుకుని నకిలీ నోట్ల తయారీ, పంపిణీకి నిందితులు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు కర్ణాకర్ యూట్యూబ్, సోషల్ మీడియా వీడియోలు చూసి నకిలీ నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.

కారులో వెళ్తుండగా పోలీసుల తనిఖీలు

రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో కారులో వెళ్తున్న నిందితులను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారులో రూ.8 లక్షల విలువైన నకిలీ నోట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుల తయారీ కేంద్రంపై దర్యాప్తు చేపట్టి, పంపిణీకి సిద్ధంగా ఉంచిన మరో రూ.6.78 కోట్ల విలువైన నకిలీ నోట్లను పట్టుకున్నారు.

సంయుక్త ఆపరేషన్‌తో గుట్టురట్టు

అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్‌వోటీ బృందాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. కేసుకు సంబంధించిన వివరాలను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. నకిలీ కరెన్సీ తయారీ, పంపిణీ వెనుక ఉన్న ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.