BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:18 pm
Posted by : KOLA MAHESH

రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
Kola Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 02:18 PM
9 వీక్షణలు

సంగారెడ్డి–భువనగిరి, చౌటుప్పల్‌–సంగారెడ్డి రహదారుల అభివృద్ధికి కేంద్ర మంత్రికి వినతిపత్రం

యాదాద్రి భువనగిరి, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): సంగారెడ్డి–భువనగిరి, చౌటుప్పల్‌–సంగారెడ్డి ప్రధాన రహదారులకు జాతీయ రహదారి హోదా కల్పించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు.

పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈ రెండు ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ, రవాణా అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారులను ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రాంతీయ కనెక్టివిటీకి ప్రయోజనం

ఈ రహదారులకు జాతీయ రహదారి హోదా కల్పిస్తే ప్రాంతీయ రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు హైదరాబాద్‌తో పరిసర ప్రాంతాల అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని ఎంపీ వివరించారు. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రజలకు, వాణిజ్య రంగానికి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలి

ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు రహదారులకు జాతీయ రహదారి హోదా కల్పించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.