BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:17 pm
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
04 Nov, 2026 - 02:17 PM
9 వీక్షణలు

 మహిళలు, యువత పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని మద్దతు

ఆత్రేయపురంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కప్పల శ్రీధర్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం

పేరవరం, మెర్లపాలెం, వద్దిపర్రు గ్రామాల్లో ర్యాలీలు.. ఇంటింటి ప్రచారం నిర్వహించిన మహిళలు, యువకులు

ఆత్రేయపురం, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): ఆత్రేయపురం మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచార గడువు ముగిసే సమయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కప్పల శ్రీధర్‌కు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పేరవరం, మెర్లపాలెం, వద్దిపర్రు తదితర గ్రామాల్లో ర్యాలీలు చేపట్టి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు.

గ్రామాల్లో ర్యాలీలు.. ఇంటింటి ప్రచారం

కప్పల శ్రీధర్ అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తూ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి

ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న నాయకులు ఎన్నికలను నమ్మకానికి, మోసానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జడ్పీటీసీ అభ్యర్థి కప్పల శ్రీధర్‌తో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు

ఈ ప్రచార కార్యక్రమంలో కనుమూరు శ్రీనివాసరాజు, రాయి వెంకటేశ్వరరావు, బెజవాడ సతీష్, గోగుల్ కిషోర్, బోనం సాయిబాబు, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.