ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం.. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచన
ఆత్రేయపురం, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీ నంబూ సూరిబాబు అధ్యక్షత వహించారు. మండల విద్యాశాఖ అధికారి-2 అడబాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఈ సందర్భంగా అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
ట్రస్ట్ సేవలను అభినందించిన ప్రతినిధులు
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
పాల్గొన్న ఉపాధ్యాయులు
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యామ్, ఉపాధ్యాయురాలు వి. కరుణశ్రీ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.