వైరా–కట్టలేరు వాగుకు భారీ వరద ఉద్ధృతి..
రెండు మండలాల మధ్య రాకపోకలు బంద్
దాములూరు కూడలి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.. వాగు దాటవద్దని అధికారుల హెచ్చరిక
ఎన్‌టీఆర్ జిల్లా, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వైరా–కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఎన్‌టీఆర్ జిల్లాలోని నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాములూరు కూడలి వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి.
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వాగులోకి భారీగా వరద నీరు చేరినట్లు తెలుస్తోంది. దాములూరు కూడలి వద్ద నీటి ప్రవాహం పెరగడంతో నందిగామ–వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వాగు దాటే ప్రయత్నం చేయవద్దు
వరద ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు వాగును దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా యువకులు చేపలు పట్టేందుకు వాగు వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. వరద నీటి ప్రవాహం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు.