BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 06:35 pm
Posted by : K MAHESH

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన: మండల వ్యవసాయ అధికారి కే.రాజు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 06:35 PM
11 వీక్షణలు

తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలి: మండల వ్యవసాయ అధికారి కే. రాజు

బయ్యారం, నవంబర్ 26:

వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని బయ్యారం మండల వ్యవసాయ అధికారి కే. రాజు సూచించారు. బయ్యారం మండలం ఇసుకమేది గ్రామపంచాయతీలో రైతులకు ప్రకృతి వ్యవసాయం, ఖేత్ బచావో అభియాన్, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కే. రాజు మాట్లాడుతూ.. రాబోయే యాసంగి సీజన్‌లో తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు ప్రణాళికలు రూపొందించుకోవడం అవసరమని వివరించారు.

మొక్కజొన్న పంటలో బిందు సేద్యం ద్వారా నీటిని పొదుపు చేస్తున్న రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకున్నారు. ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణ, పంటల వైవిధ్యీకరణకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ అధికారి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇసుకమేది సర్పంచ్ సవలం కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రైతులు పాల్గొన్నారు.