కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో అగ్నిమాపక భద్రతపై అవగాహన కార్యక్రమం
కుప్పం | ఎన్ టుడే న్యూస్:
కుప్పం ఇంజినీరింగ్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) విభాగం ఆధ్వర్యంలో బీటెక్, డిప్లొమా విద్యార్థులకు అగ్నిమాపక భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఎస్. నేతాజీ హాజరయ్యారు. అసిస్టెంట్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ పురుషోత్తంతో పాటు ఇతర అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణకు పాటించాల్సిన భద్రతా నియమాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానాలను ఎస్. నేతాజీ విద్యార్థులకు వివరించారు. అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్ డెమో ద్వారా ప్రదర్శించారు.
అగ్నిప్రమాదాల సమయంలో భయాందోళనలకు గురికాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం, వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రమాద నివారణ చర్యలను పాటించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విద్యార్థుల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన పెంపొందించడం, వ్యక్తిగత భద్రతా చర్యలను నేర్పించడం, అత్యవసర సమయాల్లో సమర్థంగా స్పందించే నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. సుధాకర్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్. భాస్కరన్, డా. సి.జి. శరవణ, హెచ్‌ఏఎస్ విభాగాధిపతి జె. మాధవన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం. గంగాధరన్, అసిస్టెంట్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ఎస్. అరుణ్ కుమార్, పీఆర్వో ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.