BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 10 October 2026, 10:23 am
Posted by : SEETHA KIRAN KUMAR

బతుకమ్మ వేళ పూల ధరలకు రెక్కలు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
10 Oct, 2026 - 10:23 AM
14 వీక్షణలు

వర్షాభావంతో తగ్గిన దిగుబడి.. పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10 (ఎన్‌ టుడే న్యూస్‌):

బతుకమ్మ పండుగ వేళ తెలంగాణలో పూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పూల దిగుబడి తగ్గడం, పండుగ నేపథ్యంలో డిమాండ్‌ పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి. గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర పూల ధరలు పెరగడంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడుతోంది.

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో బంతిపూలు కిలో రూ.150 నుంచి రూ.180 వరకు, చామంతి రూ.300 నుంచి రూ.400 వరకు, గులాబీలు రూ.200 నుంచి రూ.250 వరకు పలుకుతున్నాయి.

బతుకమ్మ పండుగలో పూలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో ధరలు పెరిగినా కొనుగోలు చేయక తప్పడం లేదని మహిళలు చెబుతున్నారు. పండుగకు అవసరమైన పూలను సమకూర్చుకునేందుకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. పూల ధరలు మరింత పెరుగుతాయేమోనన్న ఆందోళన కూడా కొనుగోలుదారుల్లో వ్యక్తమవుతోంది.