BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 09:51 pm
Posted by : KOLA MAHESH

ఇబ్రహీంపట్నం కోర్టుకు నూతన భవనం, రోడ్డు సౌకర్యం కల్పనపై దృష్టి

తెలంగాణ
/ రంగారెడ్డి / అబ్దుల్లాపూర్మెట్
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 09:51 PM
33 వీక్షణలు

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, అక్టోబర్‌ 27 | ఎన్‌ టుడే న్యూస్‌:

ఇబ్రహీంపట్నం కోర్టుకు నూతన భవనం నిర్మించడంతో పాటు కోర్టు వరకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. న్యాయవాదులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మంగళవారం ఇబ్రహీంపట్నం కోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోర్టు భవనం, మౌలిక సదుపాయాలు, న్యాయవాదుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు.

దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రస్తుత కోర్టు భవనం స్థానంలో నూతన భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. నూతన భవన నిర్మాణంతో పాటు కోర్టుకు వెళ్లే రహదారి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని తెలిపారు.

న్యాయవాదుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి ఆమోదం లభించిందని గుర్తుచేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున న్యాయవాది సామ రామ్మోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినట్లు తెలిపారు. ఆయన విజయానికి పట్టభద్రులు సహకరించాలని కోరారు.

తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం అభివృద్ధిలో న్యాయవాదులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వెదిరె వేణుగోపాల్‌ రెడ్డి, న్యాయవాదులు రాములు గౌడ్‌, వెంకట్‌ రెడ్డి, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.