BREAKING
thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం
Date of Publish : 07 October 2026, 01:51 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

వీరపట్నంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
07 Oct, 2026 - 01:51 PM
6 వీక్షణలు

రొంపిచర్ల: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వీరపట్నం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.

ఇటీవల గుండె సంబంధిత బైపాస్ శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న గ్రామ ప్రముఖుడు తీయాగూర వెంకటరెడ్డి నివాసానికి గోపిరెడ్డి వెళ్లారు. వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం గ్రామానికి చెందిన కాసు మల్లికార్జున్ రెడ్డిని కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యలపై గ్రామ నాయకులతో చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు.

ఈ పర్యటనలో స్థానిక వైఎస్సార్‌సీపీ మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.