BREAKING
thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Test 4
Date of Publish : 18 November 2026, 01:56 pm
Posted by : బాల్ధా భాస్కర్

డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో నలుగురికి రూ.50 వేల జరిమానా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
18 Nov, 2026 - 01:56 PM
7 వీక్షణలు

ఇద్దరికి రూ.10 వేలు, మరో ఇద్దరికి రూ.15 వేల చొప్పున ఫైన్

బీబీనగర్ | నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్):

బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురిని పోలీసులు మంగళవారం భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. కేసులను విచారించిన భువనగిరి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన మరో ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున జరిమానా విధించారు. దీంతో మొత్తం రూ.50 వేల జరిమానా విధించినట్లయింది.

ఈ సందర్భంగా బీబీనగర్ ఎస్‌హెచ్‌ఓ ఏ. సూర్య నాయక్ మాట్లాడుతూ, ఇప్పటివరకు బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 40 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో న్యాయస్థానం ద్వారా సుమారు రూ.4 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలతో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని ఎస్‌హెచ్‌ఓ పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదని సూచించారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రజలు పోలీసులకు సహకరించి ప్రమాదరహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని బీబీనగర్ పోలీసులు కోరారు.