BREAKING
thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు
Date of Publish : 22 September 2026, 07:38 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దసరాకు ముందు నకిలీ దుర్గగుడి సేవా టికెట్ల మోసం ఛేదన...

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 07:38 AM
4 వీక్షణలు

దసరాకు ముందు నకిలీ దుర్గగుడి సేవా టికెట్ల మోసం ఛేదన.. 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

విజయవాడ: దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో భక్తులను లక్ష్యంగా చేసుకుని నకిలీ దుర్గమ్మ సేవా టికెట్లను విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు.

రాబోయే దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక సేవా టికెట్లకు డిమాండ్ ఉంటుందని గుర్తించిన నిందితుడు సోషల్ మీడియా ద్వారా నకిలీ టికెట్లను ప్రచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. భక్తులను ఆకర్షించేలా రూపొందించిన టికెట్లపై QR కోడ్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా నగదు చెల్లింపులు చేయాలని కోరినట్లు వెల్లడించారు.

దేవస్థానం రికార్డులతో టికెట్‌ను పరిశీలించగా అది నకిలీదని గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియా ఖాతాలు, చెల్లింపులకు సంబంధించిన వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన 24 గంటల్లోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో Cr.No.77/2026 కింద BNS సెక్షన్లు 318(4), 336(3), 340(2), ఐటీ చట్టం-2008లోని 66(సి), 66(ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు గుంటూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గతంలోనూ నకిలీ ప్రకటనలు రూపొందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

దేవస్థానం సేవా టికెట్లు ఇప్పిస్తామని చెప్పి నగదు పొందేందుకు నకిలీ టికెట్లను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. తప్పుడు వివరాలతో టికెట్లను తయారు చేయడంతో పాటు QR ధృవీకరణను కూడా ఉపయోగించినట్లు గుర్తించారు. ఒకసారి పట్టుబడిన తర్వాత కూడా ఇదే తరహాలో మరోసారి మోసానికి ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

దసరా ఉత్సవాల నేపథ్యంలో భక్తులు నకిలీ సేవా టికెట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. సేవా టికెట్లను దేవస్థానం అధికారిక కౌంటర్లు లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే పొందాలని తెలిపారు. చెల్లింపులు చేసే ముందు టికెట్‌పై ఉన్న వివరాలు, QR కోడ్, అధికారిక ముద్రను ధృవీకరించుకోవాలని సూచించారు.

వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన అనధికార టికెట్లను కొనుగోలు చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద టికెట్ లేదా ఆన్‌లైన్ మోసం ఎదురైతే వెంటనే దేవస్థానం అధికారులకు లేదా ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.