తిరువూరు కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
తిరువూరు: స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, భారతదేశ రెండవ ప్రధానమంత్రి, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన కృషిని, దేశాభివృద్ధికి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. వారిద్దరూ నిస్వార్థ దేశభక్తులని, దేశం కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావులని కొనియాడారు. వారి ఆశయాలను స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశ ఉన్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి లక్ష్మీ దాస్, రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు గంజా కృష్ణమోహన్, మాజీ ఉమ్మడి కృష్ణా జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి కొత్తగుండ్ల గోపాలకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కడియాల నాగేశ్వరరావు, పల్నాటి సత్యనారాయణ, చక్రాల హరిబాబు, పర్వతం రామారావు, చావల రంగయ్య, కె.ఎల్. రావు, కొంచెం చంద్రరావు, కుంచం దినేష్, రామిశెట్టి శ్రీనివాసరావు, యద్దనపూడి రాములు, గోపిశెట్టి కృష్ణయ్య, మోహనరావు, బెంజిమెన్, కొంగల ఆదాం, ఇజ్జాడ జగన్నాథరావు, జీడిమల్ల వెంకటేశ్వరరావు, పగుట్ల చంద్రయ్య, పులిపాటి దుర్గాప్రసాద్, గరికపాటి నరసింహారావు, సీతారాములు, జోగయ్య, అజారుద్దీన్, శివ తదితరులు పాల్గొన్నారు