BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 23 June 2026, 10:12 pm
Posted by : బోరా శివారెడ్డి

గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
23 Jun, 2026 - 10:12 PM
180 వీక్షణలు

గొల్లప్రోలు | కాకినాడ జిల్లా | N Today News

గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్ (GPDP)పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు మరియు వి.ఓ.ఏలు పాల్గొన్నారు.

శిక్షణ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అమలు విధానం, ప్రజల అవసరాల గుర్తింపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి తహసీల్దార్ బి.వి. భాస్కర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఎన్. సెలట్ రాజు, జీఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓ చి. వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు అవసరమని, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) లక్ష్యాలను విజయవంతం చేయాలని సూచించారు.

డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాభివృద్ధి ప్రణాళికల తయారీలో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడం ద్వారా గ్రామాల పురోగతిని మరింత వేగవంతం చేయవచ్చని తెలిపారు