BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 23 June 2026, 09:32 pm
Posted by : V శ్రీనివాస్

​ఓటర్ల జాబితా సవరణపై బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jun, 2026 - 09:32 PM
203 వీక్షణలు

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్

​లక్షెట్టిపేట:ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) పూర్తి అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ పిలుపునిచ్చారు.

​లక్షెట్టిపేట పట్టణంలోని కే.ఎస్.ఆర్ (K.S.R) ఫంక్షన్ హాల్‌లో లక్షెట్టిపేట మండలం, మున్సిపాలిటీ మరియు దండేపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంలోనూ, ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడంలోనూ బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.

​ఈ అవగాహన సదస్సులో స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల బూత్ లెవెల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు