BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 22 June 2026, 01:02 pm
Posted by : NTODAY NEWS

ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం

తెలంగాణ
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
22 Jun, 2026 - 01:02 PM
195 వీక్షణలు

NTODAY NEWS: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం ద్వారా మరింత ఊరట లభిస్తోంది. ప్రభుత్వం అమలు చేసే పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఉపాధి హామీ జాబ్ కార్డు తప్పనిసరి కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు కూలీల హాజరు గణనీయంగా పెరిగింది.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునే సమయంలో ఆర్థిక భారం తగ్గించేందుకు ఉపాధి హామీ పథకం కింద 90 రోజులపాటు పని దినాల అవకాశాన్ని కల్పించింది.

గతంలో ఇల్లు నిర్మాణ పనులు చూసుకుంటూనే ఉపాధి హామీ పనులకు హాజరుకావడం లబ్ధిదారులకు కష్టసాధ్యంగా ఉండేది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులను నిర్వహిస్తూనే ఉపాధి హామీ కింద పని దినాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.

ఈ నిర్ణయం వల్ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సమయం, శ్రమ ఆదా కావడంతో పాటు ఇంటి నిర్మాణ ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఉపాధి హామీ పనులకు రోజువారీగా సుమారు 2,000 మంది కూలీలు హాజరవుతున్నట్లు సమాచారం. ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.