BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 23 June 2026, 09:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నీట్ కుంభకోణంపై విద్యార్థుల ఉద్యమానికి మద్దతు: డి. హరినాథ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 09:51 PM
256 వీక్షణలు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు నాలుగు రోజులుగా శాంతియుతంగా చేపడుతున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ అనుబంధ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ నాయకురాలు, జేఎన్‌యూ అధ్యక్షురాలు నేహా ఆభిజిత్‌తో కలిసి ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.

ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షల్లో కూడా బీహార్‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయని హరినాథ్ పేర్కొన్నారు. నలందా జిల్లాలో బయోమెట్రిక్ ధ్రువీకరణ వ్యవస్థను సైతం మోసం చేస్తూ కొందరిని పరీక్షలకు పంపిన ఘటనలు వెలుగుచూశాయని అన్నారు. ఈ వ్యవహారంలో పలువురిని అరెస్టు చేయడం పరీక్షల నిర్వహణలో తీవ్రమైన లోపాలను సూచిస్తోందని విమర్శించారు.

పరీక్షలకు రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించని అధికారులు, నకిలీ అభ్యర్థుల విషయంలో ఎలా నిర్లక్ష్యం ప్రదర్శించారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలపై సమగ్ర న్యాయ విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నీట్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అలాగే సంబంధిత బాధ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని హరినాథ్ కోరారు. ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఆహారం అందిస్తూ సహకరిస్తున్న ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు సహాయం చేస్తున్న వారిని ఆధార్ కార్డులు చూపించాలని పోలీసులు కోరడాన్ని కూడా ఆయన ఖండించారు.

విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంపై సమాజంలోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించాలని హరినాథ్ పిలుపునిచ్చారు.