BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 23 June 2026, 09:25 pm
Posted by : V శ్రీనివాస్

​ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం: కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jun, 2026 - 09:25 PM
262 వీక్షణలు

నస్పూర్, జూన్ 23: మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సమీకృత కార్యాలయాల భవనంలో విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు ప్రతిరోజూ ఒక పాఠశాలను తప్పనిసరిగా సందర్శించి విద్యార్థుల చదవడం, రాయడం వంటి అభ్యసన ప్రమాణాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే, ప్రధానోపాధ్యాయులు పాఠశాల సముదాయ సమావేశాల అంశాలపై నివేదికలు రూపొందించి, విద్యార్థుల హాజరు, విద్యా బోధన ఫలితాలపై ఉపాధ్యాయుల వారీగా క్షుణ్ణంగా సమీక్షించాలని స్పష్టం చేశారు.

​ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల బదిలీ ధ్రువపత్రాల (TC) సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులకు సాధ్యమైనంత వరకు కేవలం విద్యా బోధన సంబంధిత విధులనే కేటాయించాలని, బోధనేతర సిబ్బంది విధులు, మధ్యాహ్న భోజన అమలు, మరియు యు-డైస్ (U-DISE) వివరాల నమోదును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ నిర్మాణాత్మక చర్యల ద్వారా విద్యా నాణ్యత ప్రమాణాలు పెంపొంది, వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు