BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్
Date of Publish : 23 June 2026, 10:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 10:23 PM
128 వీక్షణలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా విడుదల చేసింది. అయితే సమావేశం అజెండాపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ఇటీవల కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దేశవ్యాప్తంగా ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణ పరిపాలనా అంశాలు, కీలక ప్రభుత్వ నిర్ణయాలు లేదా రాజ్యాంగపరమైన విషయాలపై రాష్ట్రపతి, ప్రధాని మధ్య తరచూ సమావేశాలు జరుగుతుంటాయి. అయితే తాజా సమావేశం వెనుక ఉన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భేటీపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.