BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 05:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి మున్సిపాలిటీని కూటమికి కానుకగా ఇవ్వండి.. సైకిల్ గుర్తుకు ఓటేయండి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 05:35 PM
33 వీక్షణలు

ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి ఏలూరు జిల్లా, చింతలపూడి: చింతలపూడి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 26న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకుని కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికలపై మాట్లాడారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్తేరు రాణితో పాటు కూటమి తరఫున బరిలో ఉన్న వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. చింతలపూడి మున్సిపాలిటీని కూటమి ప్రభుత్వానికి కానుకగా అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సైకిల్ గుర్తు, జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కమలం గుర్తు కేటాయించారని వివరించారు. ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థుల గుర్తులను గమనించి ఓటు వేయాలని సూచించారు. ముఖ్యంగా సైకిల్ గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. చింతలపూడి పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లను కూడా కూటమి అభ్యర్థులుగా ఎన్నుకుంటే పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకుని కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని సొంగ రోషన్ కుమార్ కోరారు.