BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 06:56 pm
Posted by : K MAHESH

కిశోర బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 06:56 PM
18 వీక్షణలు

పోషకాహార లోపం నివారణకు ‘తొలిముద్ద’ అల్పాహార పథకం: సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి

నెల్లికుదురు, నవంబర్ 26:

కిశోర బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి అన్నారు. గురువారం నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తొలిముద్ద’ అల్పాహార పథకాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు తగిన పోషకాహారం అందకపోవడం వల్ల వారు శారీరక, మానసిక సమస్యలకు గురయ్యే పరిస్థితులను నివారించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అల్పాహార పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా పిల్లలకు పోషక విలువలు కలిగిన ఆహారం అందించి, పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం క్రమం తప్పకుండా అందిస్తున్న పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను పిల్లలకు సక్రమంగా అందించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.డి. సైదులు పాషా, వార్డు సభ్యుడు అక్తర్ పాషా, అంగన్వాడీ టీచర్లు మంజుల, దేవకి, సునీత, బాలింతలు, బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు.