BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 09 October 2026, 09:14 pm
Posted by : KOLA MAHESH

శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
09 Oct, 2026 - 09:14 PM
8 వీక్షణలు

65 మంది మహిళలతో ఆటపాటలు.. విజేతలకు ఇత్తడి పూజా దీపాల బహుమతులు

రామన్నపేట, అక్టోబర్ 9: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం శోభనాద్రిపురం ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 65 మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.

రోజువారీ పనుల ఒత్తిడిని మరిచి మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోటీల్లో విజేతలకు గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్ చేతుల మీదుగా ఇత్తడి పూజా దీపాలను బహుమతులుగా అందజేశారు.

దసరా సెలవులకు ముందు చివరి పనిదినం కావడంతో పాఠశాల ప్రాంగణంలో పనిచేస్తున్న 15 మంది మహిళా సిబ్బంది కూడా వేడుకల్లో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కంచి మధుసూదన్ మాట్లాడుతూ.. పూలతో మహిళలు జరుపుకునే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని, ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. బతుకమ్మ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా పిల్లాపాపలతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో కలిసిమెలిసి జీవించాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థాయి మహిళా ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ మహిళలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.